![]() |
![]() |

సుడిగాలి సుధీర్(Sudigali Sudheer) అంటే ఇంద్రజ(Indraja)కు చెప్పలేనంత ఇష్టం. సాఫ్ట్‌వేర్ సుధీర్ మూవీలో సుధీర్ కి మదర్ రోల్ చేశారు ఇంద్రజ. అప్పటి నుంచి ఒక తల్లీకొడుకుల అలా కంటిన్యూ అవుతూ వచ్చారు. ఐతే సుధీర్ గురించి ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు.
"అమ్మ అంటే అమ్మ. అంతే. ఆ ఒక్క మాటకు ఫిక్స్ ఐపోయి నన్ను అలాగే చూసుకుంటాడు. నాతో అంత ప్రేమగా అలాగే ఉంటాడు. సుధీర్ చేరుకోవాల్సిన ఆ ఒక్క పొజిషన్ కి ఇంకా ఎందుకు చేరుకోలేదా అన్న ఒక్క బాధ ఉంది నాకు. శ్రీదేవి డ్రామా కంపెనీ తర్వాత ఇద్దరం కలిసి వర్క్ చేయలేదు. ఐనా కానీ ఇప్పటికీ అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం. ఆయన మాట తీరు, ప్రవర్తించే విధానం, రెస్పెక్ట్ అవన్నీ చూసాక నాకు పుట్టకపోయిన నా కొడుకు అన్న ఫీలింగ్ వచ్చేసింది. ఈ బంధం దేవుడిచ్చిన బంధం." అని చెప్పారు ఇంద్రజ.
"సుధీర్ హోస్ట్ గా చేసేటప్పుడు మీరు జడ్జ్ చేసేవారు.. అమ్మ కొడుకుల బాండింగ్ చాలా బాగుండేది.. మిమ్మల్ని చాలా మిస్సవుతున్నాం అని.. ఇప్పటికీ నేను సుధీర్ ని అదే విషయం అడుగుతూ ఉంటాను." అని హోస్ట్ వర్ష అనేసరికి.. "ఇప్పుడు దీనికి నేను ఆన్సర్ చెప్తే రష్మీ నా పీక కొరికేస్తుంది. ఎందుకంటే రష్మీ కూడా నాకు చాలా క్లోజ్. ఆ అమ్మాయి కూడా వర్క్ హాలిక్, చాలా ఎమోషనల్ పర్సన్. ఆ ఆమ్మాయి లాంటి మనసు ఎవరి దగ్గర చూడలేదు. సుధీర్, రష్మీతో బాండింగ్ నాకు ఆన్ స్క్రీన్ కంటే ఆఫ్ స్క్రీన్ బాండింగ్ చాలా ఎక్కువ. సుధీర్ యాంకరింగ్ ఇష్టం కానీ యాంకర్ గా ఇష్టపడను. అతన్ని నేను హీరోగానే చూడాలనుకుంటాను. టాప్ స్టార్ గా నిలదొక్కుకోవాలి" అని చెప్పారు ఇంద్రజ.
![]() |
![]() |